ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు.. రుణమాఫీ అక్కర్లేదు: వెంకయ్య - Vice President Venkaiah Naidu unveiled a book

విశ్రాంత ఐఏఎస్‌ మోహన్‌కందా రాసిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ హైదరాబాద్​లోని అమీర్​పేటలో ఆవిష్కరించారు. ''భారత్‌లో వ్యవసాయం-రైతుల ఆదాయం రెట్టింపు సవాళ్లు'' అనే పుస్తకాన్ని మోహన్ కందా రాశారు.

గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు.. రుణమాఫీ అక్కర్లేదు : వెంకయ్య
గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు.. రుణమాఫీ అక్కర్లేదు : వెంకయ్య

By

Published : Mar 31, 2021, 1:27 PM IST

గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు.. రుణమాఫీ అక్కర్లేదు : వెంకయ్య

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందంటే.. అందుకు వ్యవసాయ రంగమే కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి మోహన్‌కందా రాసిన 'భారత్‌లో వ్యవసాయం-రైతుల ఆదాయం రెట్టింపు సవాళ్లు' అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య పాల్గొన్నారు.

ఇలా చేస్తే రుణమాఫీ అవసరం లేదు..

ప్రస్తుతం దేశంలో వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గుతోందని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వెంకయ్య నాయుడు సూచించారు. లాభసాటిగా లేకపోవడంతో రైతులు సాగును వీడుతున్నారని వెల్లడించారు. కొవిడ్ వల్ల అన్ని రంగాలు దెబ్బతింటే వ్యవసాయం మాత్రం తట్టుకుని నిలబడిందని తెలిపారు. రైతుల వల్లే ఆర్థిక వ్యవస్థ కొంతైనా నిలబడగలిగిందని వ్యాఖ్యానించారు. రైతులను ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలని సూచించారు. కరోనా వల్ల పౌష్టికాహారంపై శ్రద్ధ పెరిగిందని పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రుణ మాఫీ అవసరం లేదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:'కరోనాను ఈజీగా తీసుకోవద్దు.. బీ అలర్ట్​'

ABOUT THE AUTHOR

...view details