ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వర్ణ భారత్ ట్రస్ట్​కు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - news updates in krishna district

భారత ఉపరాష్ట్రపత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు గన్నవరం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో స్వర్ణ భారత్ ట్రస్ట్​కు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By

Published : Dec 27, 2020, 5:50 PM IST

హైదరాబాద్​ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కృష్ణాజిల్లా గన్నవరం చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు నీలంసాహ్ని, లా అండ్ ఆర్డర్ ఉన్నతాధికారి రవిశంకర్ అయ్యర్, కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసరావు, పలువురు భాజపా నేతలు వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం రోడ్డు మార్గంలో ఉపరాష్ట్రపతి ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్​కు వెళ్లారు. 300 మంది భద్రత సిబ్బందితో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి స్వర్ణ భారత్ ట్రస్టులో బస చేయనున్న వెంకయ్యనాయుడు.. రేపు ఉదయం సీపెట్ సంస్థను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అలాగే రేపు సాయంత్రం స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొంటారు. పలు కోర్సులలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందిస్తారు. మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బెంగళూరు వెళ్తారు.

ఇదీచదవండి.

'సినీ పరిశ్రమ నుంచి వచ్చేవారు రాజకీయాల్లో ప్రజాదరణ పొందలేరు'

ABOUT THE AUTHOR

...view details