ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడిపై వీఎంసీ వినూత్న ప్రయత్నం - vgmc latest news

కరోనా మహమ్మారి బెజవాడపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కొవడంలో ప్రజల పాత్ర ఎంతో కీలకం. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడం, లాక్‌డౌన్‌కు సహకరించడం, వ్యక్తిగత పరిశుభ్రత వంటివి ముఖ్యమైనవి. ఈ అంశాల ఆధారంగా విజయవాడ నగరపాలక సంస్థ భారీగా ప్రచారం చేపట్టింది. కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ సూచనలతో కార్పొరేషన్‌లోని సోషల్‌ మీడియా విభాగం వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది.

vgmc find out differint ways to control corona
కరోనా కట్టడిపై వీఎంసీ వినూత్న ప్రయత్నం

By

Published : May 11, 2020, 3:45 PM IST

లాక్‌డౌన్‌తో ఎక్కువ మంది అంతర్జాలం, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌, తదితర వాటికి అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా 4వేలు, ట్విట్టర్‌తో 4.5 వేలు, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లక్ష మందికి వీఎంసీ చేరువైంది. నెలన్నర క్రితం ముంబయి నగరపాలిక విడుదల చేసిన ఓ లఘు చిత్రాన్ని ఎక్కువ మంది చూశారు. ఈ నేపథ్యంలో ఆ విభాగం ఇన్‌ఛార్జి కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో బృందం ఇప్పటికే మూడు చిత్రాలను రూపొందించి విడుదల చేశారు. కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై చిత్రాన్ని తయారు చేశారు. లాక్‌డౌన్‌లో విజయవాడ నగరం ఎలా ఉందో దృశ్యసహితంగా తీసిన లఘుచిత్రాలు ఎక్కువ ఆదరణ చూరగొన్నాయి.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వీఎంసీ పరిధిలో వివిధ అవసరాల కోసం ఫోన్‌ నెంబర్లు, వలస కూలీలకు ఆశ్రయం వంటి వాటిపై వినూత్న రీతిలో క్రియేటివ్‌లు, పోస్టర్లను రూపొందించారు. ఇవి వాట్సాప్‌ ద్వారా విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి.

ఇవీ చూడండి...

వైద్యుడి ప్రయత్నం.. మందుబాబుల ముందు విఫలం

ABOUT THE AUTHOR

...view details