వేటూరి సుందరరామ్మూర్తి 85వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామం పెదకళ్లేపల్లిలో జరుపుకోవడం ఆనందంగా ఉందని... మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో వేటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కావ్య గౌరవం కల్పించిన వ్యక్తి వేటూరి అని కొనియాడారు. అనేక జాతీయ పురస్కారాలు సాధించిన మహోన్నత వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. వేటూరి పాట తెలుగుజాతిని పరవశింపచేసిందని అన్నారు. వేటూరి జన్మదినాన్ని తెలుగు పదాల జన్మదినంగా భావించవచ్చని పేర్కొన్నారు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని గొంతెత్తిన ఏకైక కవి వేటూరి సుందరరామ్మూర్తి అని గుర్తుచేశారు.
'అనేక జాతీయ పురస్కారాలు సాధించిన మహోన్నత వ్యక్తి వేటూరి' - కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో వేటూరి జయంతి వార్తలు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో వేటూరి 85వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనేక జాతీయ పురస్కారాలు సాధించిన మహోన్నత వ్యక్తి వేటూరి అని కొనియాడారు.
మాజీ ఉపసభాపతి