కమనీయంగా కల్యాణం - durga gudi
విజయవాడ దుర్గ దేవస్థాన దత్తత ఆలయమైన మొవ్వ వేణుగోపాలుని కల్యాణం శోభాయమానంగా జరిగింది.
వేణుగోపాలుని కల్యాణం
కృష్ణా జిల్లా మొవ్వ వేణుగోపాల స్వామి వార్షిక ఉత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెజవాడ దుర్గ ఆలయ ఈవో కోటేశ్వరమ్మ హాజరయ్యారు. అధికార హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. కన్నుల పండవగా జరిగిన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.