కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతులు ఇళ్లలోకి వచ్చి... అందిన వస్తువులు తీసుకువెళ్లిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపైకి దాడికి దిగుతున్నాయంటూ వాపోతున్నారు. కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, కోతల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.
గుంపులు గుంపులుగా కోతులు... ఆందోళనలో స్థానికులు - veravalli faces monkeys problem
ఇళ్లల్లోకి చొరబడి చేతికి అందిన వస్తువులు తీసుకుపోతున్నాయి. అడ్డొస్తున్న వారిపై దాడికి దిగుతున్నాయి. కోతుల బెడద నుంచి తమను రక్షించాలంటూ కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామస్థులు వేడుకుంటున్నారు.
వీరవల్లిలో కోతుల బెడద