కృష్ణాజిల్లా మక్కపేట శ్రీకోదండ రామాలయంలో విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆలయ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆలయ ప్రధాన ద్వారం గడియ తొలగించి నేరుగా ఆలయంలోకి దుండగులు ప్రవేశించి విగ్రహాలను తీసుకుపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం అధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
మక్కపేట కోదండరామాలయంలో విగ్రహాల చోరీ - vatsvai mandal kodandaramalayam temple news in krishna dst
కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేట శ్రీ కోదండ రామాలయంలో విగ్రహాలు చోరీకి గురయ్యాయి. రామాలయంలోని సీతారాముల పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.

వత్సవాయి మండలం కోదండరామాలయంలో విగ్రహాలు చోరి
వత్సవాయి మండలం కోదండరామాలయంలో విగ్రహాలు చోరి