రామోజీ ఫిల్మ్ సిటీలో 'వసుంధర' పురస్కారాలు - Vasundhara awards ceremony at ramoji film city
రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా దినోత్సవం సందర్భంగా 'వసుంధర' పురస్కారాల వేడుక వైభవంగా జరిగింది. విభిన్న రంగాల్లో కృషి చేసిన ప్రతిభావంతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మహిళా దినోత్సవం సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన 'వసుంధర' పురస్కారాల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవం ఆద్యంతం అలరించింది. విభిన్న రంగాల్లో కృషి చేసిన ప్రతిభావంతులను సత్కరించారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళా శక్తికి అద్దం పట్టేలా.. వారిలో మరింత స్ఫూర్తి నింపేలా వేడుక సాగింది. చారిత్రక అంశాలను ప్రతిబింబిస్తూ.. మహిళల గొప్పదనానికి పట్టం కట్టేలా విభిన్న నృత్యప్రదర్శనలు నిర్వహించారు.