ఎస్సీ యువకుడు శివప్రసాద్ శిరోమండనం కేసులో ఇంతవరకు అసలైన దోషులను పట్టుకోలేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఈ మేరకు ఆయన జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. బాధితులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా ఉండకూడదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే శివ ప్రసాద్ మావోయిస్టుల్లో చేరిపోతా నంటూ రాష్ట్రపతికి లేఖ రాశారని చెప్పారు. ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య - taja news of sc boy want to go nekslits
రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక వర్గానికి చెందిన శివప్రసాద్ శిరోమండనం కేసులో ఇంతవరకూ అసలైన దోషులను పట్టుకోలేదని విమర్శించారు. ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య