వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్న క్యాంటీన్‌ల వల్ల ప్రజలు సోమరిపోతుల్లా తయారయ్యారని మాట్లాడటం సరికాదంటూ తెదేపా నాయకుడు వర్ల రామయ్య మండిపడ్డారు.వైకాపా ప్రభుత్వానికి పేదలంటే ఎందుకంత అవహేళన అని ప్రశ్నించారు. పేదవారిని సోమరిపోతులు అనటం వైసీపీ నేతలకి తగదని హితవు పలికారు. అన్న క్యాంటీన్లు లేకపోవటం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందని మాట్లాడటం సరికాదన్నారు. పేదవాడి ఆకలి మంట కన్నా ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యమా అంటూ ధ్వజమెత్తారు.
'పేదవాడి ఆకలి తీర్చని ఆదాయం ఎందుకు' - ycp mp vijayasai reddy
అన్న క్యాంటీన్‌ల వల్ల ప్రజలు సోమరిపోతుల్లా తయారయ్యారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడటం సరికాదని తెదేపా నాయకుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
!['పేదవాడి ఆకలి తీర్చని ఆదాయం ఎందుకు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4224490-783-4224490-1566580741866.jpg)
'పేదవాడి ఆకలి తీర్చని ఆదాయం ఎందుకు'