విజయసాయి రెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డిని మించిన సూట్ కేసు కంపెనీల సృష్టికర్త ఎవరైనా ఉన్నారా అని ఎద్దేవా చేశారు. అంబులెన్స్‌ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని వర్ల ఆరోపించారు.
ఏ-2 విజయసాయిరెడ్డి గురించి సజ్జల దగ్గర మొత్తం సమాచారం ఉంది. మీరు కూడబెట్టిన ఆస్తుల చిట్టా సజ్జల.. జగన్‌కు ఇచ్చింది నిజం కాదా..?. జగన్‌కేమో విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతారని భయం. విజయసాయిరెడ్డికేమో లెక్కలో చూపని ఆస్తులను జగన్ స్వాధీనం చేసుకుంటారనే భయం. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి 25 రోజులు కనిపించలేదు. నైతిక విలువలతో శేష జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి- వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు