ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోండి: వర్ల రామయ్య - మంత్రి కొడాలిపై వర్ల రామయ్య ఫిర్యాదు

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, వసంత కృష్ణప్రసాద్​లపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్​కు లేఖ రాశారు. బహిరంగ బెదింపులు చేస్తే పోలీసు శాఖ ఉదాసీనంగా వ్యవహరించటం తగదని స్పష్టం చేశారు.

varla ramaiah
varla ramaiah

By

Published : Sep 10, 2020, 5:57 AM IST

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, వసంత కృష్ణప్రసాద్​లపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్​కు బుధవారం లేఖ రాశారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన మీడియా సమావేశంలో... తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాలపై ఈ ముగ్గురు నేతలు బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో పేర్కన్నారు. బాధ్యతగల పదవుల్లో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడే విధంగా బహిరంగ బెదింపులు చేస్తే పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించటం తగదని స్పష్టం చేశారు. ముగ్గురు నేతలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజల్లో విశ్వాసం పెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వర్ల రామయ్య లేఖలో కోరారు.

మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును చంపేస్తామని బెదిరించిన మంత్రి కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్​బాబులతో కలిసి వర్ల రాయయ్య విజయవాడ పోలీస్ కమిషనర్​ బి.శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details