చట్టప్రకారం పని చేయడం చేతగాకుంటే రాజీనామా చేయాలని తాజాగా హైకోర్టు వ్యాఖ్యానించడంపై డీజీపీ, ముఖ్యమంత్రి స్పందించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గతంలో కూడా ఖాకీస్టోక్రసీ అనే పదాన్ని న్యాయస్థానం వాడినందున
దాని అర్థమేమిటో డీజీపీ.. పోలీసులకు చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఎవరిపై ఆధారపడి పని చేస్తున్నారని...పనితీరు చాలా అధ్వానంగా ఉందని కోర్టు అనటం నిజం కాదా అని వర్ల నిలదీశారు.
'డీజీపీని చీవాట్లు పెడితే... ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు' - డీజీపీ కేసు వార్తలు
రిటైర్మెంట్ చివరిరోజుల్లో ఉన్న డీజీపీ ఇప్పటికైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటే మంచిదని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. తనను ఆడించేవారు...చెప్పిందల్లా వినబట్టే నేడు డీజీపీ హైకోర్టు ముందు తెల్లమొహం వేశారని విమర్శించారు.
వర్లరామయ్య
తనను ఆడించేవారు చెప్పిందల్లా వినబట్టే నేడు డీజీపీ హైకోర్టు ముందు తెల్లమొహం వేశారని విమర్శించారు. రిటైర్మెంట్ చివరిరోజుల్లో ఉన్న డీజీపీ ఇప్పటికైనా చట్టప్రకారం, పోలీస్ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకుంటే మంచిదని హితవు పలికారు. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర డీజీపీని చీవాట్లు పెడితే, ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఇదీ చూడండి.రాగల 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు