'జగన్ ఆస్తులు ప్రకటించాలి' - challenge
అమరావతిలో జగన్ నిర్మించిన ఇళ్లు కొన్నదా..? కొట్టేసిందా..? లోటస్పాండ్ తనదే అని చెప్పుకోలేని స్థితిలో వైకాపా అధినేత ఉన్నారు. మోదీ, కేసీఆర్ చేతిలో చిక్కుకున్న చిలుక జగన్ - వర్ల రామయ్య
మీడియా సమావేశంలో వర్ల రామయ్య
సాధారణ ఎన్నికలకు ముందు ఆస్తులు ప్రకటించాలని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, వైకాపా అధినేత జగన్కుసవాల్ విసిరారు. దేశంలో ప్రజలందరి కంటే వైకాపా అధినేత ప్రత్యేకమని.. అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతారనివ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం దాటాలంటే కోర్టు అనుమతి లేనిదే బయటకు వెళ్లలేని ప్రత్యేక పౌరుడు జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ తీసుకునే నిర్ణయాలు మోదీ ఓకే చేయాలి, కేసీఆర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.