మాకు వరద కొత్తేం కాదు మేము వెళ్లం - varadha at prakasham barriage
ప్రకాశం బ్యారేజ నుంచి వస్తున్న వరదతో లంక గ్రామాలు నీట మునుగుతున్నాయి.... అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పినా... వారికీ వరద కొత్తేం కాదని ప్రజలు మొండికేస్తున్నారు.
![మాకు వరద కొత్తేం కాదు మేము వెళ్లం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4150153-979-4150153-1565940732594.jpg)
ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తోంది. పులిచింతల నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 7 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తుంది. దిగువకు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రెవెన్యూ అధికారులు చెప్తున్నా.... వారికీ వరద కొత్తేంకాదని లంక గ్రామాలు ప్రజలు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో లంకగ్రామాల్లో అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి రక్షణ చర్యలను ఏర్పాటు చేశారు.
వరదనీటి ప్రవాహంతో పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని యనమలకుదురు, చోడవరం, పెదపులిపాక, మద్దూరు, కె.వి.పాలెం తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, వల్లూరిపాలెం, చాగంటిపాడు, కళ్లెంవారిపాలెం, తోట్లవల్లూరు, ఐలూరు పరిధిల్లోని పంటపొలాలు నీటమునిగాయి.