రాష్ట్రానికి చంద్రబాబు ప్రవాస నేతగా మారారని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు... జైలుకి వెళ్లొచ్చిన తెదేపా నేతలను పరామర్శించేందుకు మాత్రం రాష్ట్రానికి వచ్చారని విమర్శించారు.
మరోవైపు కొండపల్లి అటవీ భూముల్లో మైనింగ్‌కు సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమ తనపై చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని కృష్ణప్రసాద్ చెప్పారు. తెదేపా హయాంలో జరిగిన అవినీతిపై దేవినేని ఉమ సీబీఐ విచారణకు సిద్ధమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జగ్గీవాసు దేవన్‌కు 400 ఎకరాల అటవీ భూమి ఇవ్వాలని తెదేపా నేతలు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.