ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో కాపు సంఘం నేతలతో వంగవీటి రాధా భేటీ - కాపు నేతలతో వంగవీటి రాధా సమావేశం

కృష్ణా జిల్లా గుడివాడలోని కాపు సంఘం నేతలతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. గుడివాడలో రాధా వరుస సమావేశాలు నిర్వహించటం చర్చనీయంశమైంది.

వంగవీడి రాధా సమావేశం
వంగవీడి రాధా సమావేశం

By

Published : Mar 6, 2022, 5:40 PM IST

Updated : Mar 6, 2022, 7:06 PM IST

కృష్ణాజిల్లా గుడివాడలోని ఆర్టీసీ కాలనీలో.. నియోజకవర్గ పరిధిలోని కాపు సంఘం ముఖ్య నేతలతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నేతలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ గుడివాడలో తరచూ సమావేశం నిర్వహించటం.. వైకాపా నేతలు ఎక్కువగా హాజరవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై రాధాను ప్రశ్నించగా.. మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందంటూ వెళ్లిపోయారు.

రాధా సమావేశాల నేపథ్యంలో రాజకీయ చైతన్యం కలిగిన గుడివాడలో భవిష్యత్తులో ఏటువంటి రాజకీయ పరిణామాలు నెలకొంటాయోనన్న ఆసక్తి స్థానిక ప్రజల్లో నెలకొంది.

Last Updated : Mar 6, 2022, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details