మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం దారుణమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బూతుల మంత్రి కొడాలిని అదుపు చేయడం రాని సీఎం, దేవినేని ఉమా దీక్షను అడ్డుకోవడమేంటని నిలదీశారు. మహిళల చేతిలో వైకాపా నేతలకు చీపురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.
'ఉమా అరెస్టును అడ్డుకున్న మహిళలపై లాఠీఛార్జీ చేయడం దారుణం' - కృష్ణా జిల్లా వార్తలు
దేవినేని ఉమా అరెస్టును తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. బూతుల మంత్రి కొడాలిని అదుపు చేయడం రాని సీఎం, ఉమా దీక్షను అడ్డుకోవడవటం ఏమిటని నిలదీశారు. అరెస్టును అడ్డుకున్న మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
మహిళలపై లాఠీఛార్జీ చేయడం దారుణం