ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''వంశీ పార్టీ మార్పుపై స్పందించాల్సిన అవసరం లేదు'' - యార్లగడ్డ వెంకట్రావు తాజా వార్తలు

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైకాపాలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని గన్నవరం వైకాపా నియోజకవర్ల బాధ్యుడు యార్లగడ్డ స్పష్టం చేశారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.

'వంశీ పార్టీమార్పుపై స్పందిచాల్సిన అవసరం లేదు'

By

Published : Nov 20, 2019, 2:18 PM IST

Updated : Nov 20, 2019, 4:00 PM IST

'వంశీ పార్టీమార్పుపై స్పందించాల్సిన అవసరం లేదు'

త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి తనను ఆదేశించినట్లు గన్నవరం వైకాపా నియోజకవర్గ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైకాపాలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై ప్రశ్నించగా.. యార్లగడ్డ సమాధానం దాటవేశారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానంతో అమెరికాలో వ్యాపారాలను వదులుకుని మరీ పార్టీ కోసం పని చేయడానికి వచ్చానన్నారు. పార్టీలోకి వస్తానని వంశీ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో నియోజకవర్గ కార్యకర్తల మనోభావాలను వివరించామన్నారు.

Last Updated : Nov 20, 2019, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details