కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం మున్నలూరు, చందర్లపాడు మండలం ఉస్తేపల్లి ఇసుక రీచ్‌లను ఎన్ఫోర్స్మెంట్ అధికారి వకుల్ జిందాల్ పరిశీలించారు. ఆయనతో పాటు నందిగామ సబ్ డివిజన్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, రూరల్ సీఐ సతీష్, చందర్లపాడు ఎస్సై ఏసోబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కొత్త ఇసుక పాలసీ మన రాష్ట్రంలో అమలవుతుందన్న వకుల్ జిందాల్... కొత్త ఇసుక పాలసీ విధానానికి బిడ్డింగ్ వేసిన జేపీ పవర్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 58 ఇసుక రీచ్‌లు ఉన్నాయని ఇప్పటివరకు జేపీ పవర్ కంపెనీకి ఐదు ఇసుక రీచ్‌లను అప్పగించామన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన రీచ్‌లను కూడా ఒక్కొక్కటిగా జేపీ పవర్ కంపెనీకి అప్పగిస్తామన్నారు.
ఇసుక రీచ్‌లను పరిశీలించిన వకుల్ జిందాల్ - కృష్ణాజిల్లా తాజా వార్తలు
నందిగామ నియోజకవర్గంలోని ఇసుక రీచ్‌లను ఎన్ఫోర్స్మెంట్ అధికారి వకుల్ జిందాల్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కొత్త ఇసుక పాలసీ మన రాష్ట్రంలో అమలవుతోందని ఆయన అన్నారు.
![ఇసుక రీచ్‌లను పరిశీలించిన వకుల్ జిందాల్ ఇసుక రీచ్‌లను పరిశీలించిన వకుల్ జిందాల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11807785-566-11807785-1621344646210.jpg)
ఇసుక రీచ్‌లను పరిశీలించిన వకుల్ జిందాల్