ఈనెల 27న సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన భారత్ బంద్(Bharat bandh)లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా చైతన్య సదస్సులు నిర్వహిస్తామని రైతు సంఘ నాయకులు, కిసాన్ కోర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. భారత్ బంద్కు ప్రజా, రైతు, కార్మిక సంఘాల నుంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ, లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేస్తూ.. ఈనెల 27న భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి..