కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 100 రోజులకు పైగా దిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించామని సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.
దిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా సమన్వయ సమితి సమావేశం.. - రైతు సమన్వయ సమితి కన్వీనర్ వడ్డె శోభానాద్రీశ్వరరావు
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమితి సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యచరణను చర్చించినట్లు వడ్డె శోభానాద్రీశ్వరరావు తెలిపారు.
విశాఖ ఉక్కు పరిశ్రమపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. మార్చి 13న ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యువజన, కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమావేశానికి రైతు సంఘాలు హాజరవుతారన్నారు. 19వ తేదీన అన్ని మార్కెట్ యార్డులలో మార్కెట్ సెస్ రద్దును నిరసిస్తూ వినతిపత్రాలు అందజేస్తామన్నారు. 23న భగత్ సింగ్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించి , కాగడాల ప్రదర్శన చేపడతామన్నారు.
ఇదీ చదవండి:'విలువలు, విశ్వసనీయతల పునాదులపై వైకాపా పురుడు పోసుకుంది'