ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాక్సిన్ లేక.. నిరాశగా వెనుదిరుగుతున్న ప్రజలు! - టీకా కొరత తాజా వార్తలు

కొవిడ్‌ టీకా కొరత కారణంగా.. రాష్ట్రంలో టీకా ఉత్సవం అంత ఉత్సాహంగా జరగడంలేదు. ప్రజలు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి కనబడుతోంది. కొన్ని చోట్ల ప్రజల వెనుదిరుగుతున్న సంఘటనలు టీకా కొరతను ప్రతిబింబిస్తున్నాయి. కృష్ణా, విశాఖ జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

Vaccine shortage in government
నిండుకున్న వాక్సిన్

By

Published : Apr 12, 2021, 3:16 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో కొవిడ్ టీకా కోసం.. ప్రజలు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. నేతాజీనగర్‌లోని వార్డు సచివాలయం సిబ్బంది.. సోమవారం వ్యాక్సిన్‌ వేస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. అర్హులైన వారంతా.. టీకా వేయించుకోవడానికి సచివాలయానికి వెళ్లారు. వారందరికీ.. వ్యాక్సిన్‌ లేదని నింపాదింగా చెప్పి.. తిప్పి పంపించారు. పెనుగంచిప్రోలు, చందర్లపాడు, నందిగామ పీహెచ్​సీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వెంటనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొవిడ్‌ టీకా కొరత కారణంగా… రాష్ట్రంలో టీకా ఉత్సవం అంతగా జరగలేదు. విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆదివారం ఉదయానికి 580 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం కల్లా ఐపోయాయి. కేంద్రం టీకా ఉత్సవం ప్రారంభించామని చెప్పింది. అందుకు 2 లక్షల 70 వేల వ్యాక్సిన్లు అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరారు. వ్యాక్సిన్ నిల్వలు లేని కారణంగా.. ఉత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. మాడుగులలోని ఆస్పత్రిలో రెండ్రోజులకు సరిపడా టీకాలు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు. అయితే మరో 600ల టీకాల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు వైద్యాధికారి సూర్య ప్రకాశరావు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details