కొవిడ్ టీకా డోసులు కృష్ణాజిల్లా గన్నవరంలోని రాష్ట్ర టీకా కేంద్రానికి చేరాయి. భారత్ బయోటెక్ సంస్థకు చెందిన 2 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు గన్నవరం చేరగా.. అక్కడినుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లాలకు తరలించారు.
గన్నవరం చేరుకున్న 2 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు - గన్నవరం చేరుకున్న వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు పంపిణీ తాజా వార్తలు
ప్రత్యేక వాహనాల్లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులను అధికారులు జిల్లాలకు తరలించారు. గన్నవరంలోని రాష్ట్ర టీకా కేంద్రానికి చేరుకున్న టీకా డోసులను జిల్లాలకు పంపిణీ చేశారు.
గన్నవరం చేరుకున్న వ్యాక్సిన్ డోసులు
కృష్ణా జిల్లాకు 35 వేలు, విశాఖకు 15 వేలు వ్యాక్సిన్ డోసులు.. తూర్పు గోదావరికి 36 వేలు, పశ్చిమ గోదావరి జిల్లాకు 30 వేల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపించారు. గుంటూరు జిల్లాకు 34 వేలు, నెల్లూరు జిల్లాకు 9,500, చిత్తూరు జిల్లాకు 15,500, ప్రకాశం జిల్లాకు 25 వేల డోసుల చొప్పున అధికారులు తరలించారు.
ఇవీ చూడండి...