గన్నవరంలో..
కృష్ణాజిల్లాలోని గన్నవరం పరిసర ప్రాంతాల్లో దాదాపు యాభై మేర ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు ఉండటంతో ఆయా సంస్థల ఉద్యోగులు టీకా వేయించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. స్థానిక బాలుర జడ్పీ పాఠశాలలోని శాశ్వత టీకా పంపిణీ కేంద్రం వద్ద రద్దీ ఏర్పడింది. సుమారు అర కిలోమీటర మేర క్యూ దర్శనమిచ్చింది. వైద్యాధికారిణి జె. సంధ్య నేతృత్వంలో సిబ్బంది టీకా పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నందిగామలో...
నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మండలంలోని పలు గ్రామాలవారికి మొదటి డోస్ కొవిషీల్డ్ టీకాలు వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఫ్రంట్ లైనర్స్తోపాటు 45 ఏళ్లు నిండిన బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మొదటి డోస్ టీకా వేశారు.
పెనమలూరులో..
పెనమలూరు వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ప్రజలు భారీగా క్యూ కట్టారు. టీకాల కోసం ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. దాదాపు 2 కి.మీ. మేర క్యూలైన్లో జనాలు ఉన్నారు.
మైలవరంలో...
మైలవరంలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పంపిణీని ప్రారంభించారు. హానిమి రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రంలో 45 ఏళ్లు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులకు కూపన్లు జారీ చేశారు. దానికి అనుగుణంగా వ్యాక్సిన్లు వేస్తామని వైద్యాధికారి నరేశ్ తెలిపారు.
ప్రకాశం జిల్లాలో...
45 ఏళ్ళు నిండిన ప్రతిఒక్కరికి టీకా వేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా యువనేత కరణం వెంకటేష్ బాబు అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అయన పరిశీలించారు.
ఇదీ చదవండి: