ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టేడియంలో కుప్పలుగా వాడేసిన పీపీఈ కిట్లు... ఆందోళనలో స్థానికులు - మకినేని బసవపున్నయ్య స్టేడియం న్యూస్

కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్నా... ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా... కొందరు అలసత్వం మానటం మాత్రం లేదు. అవగాహన లేక కొందరైతే... వైరస్ ఉద్ధృతి ఏ విధంగా ఉందో తెలిసీ మనకెందుకులే అని పట్టనట్లు వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనే విజయవాడలో జరిగింది.

used ppe kits
స్టేడియంలో వాడేసిన పీపీఈ కిట్లు

By

Published : Apr 22, 2021, 8:04 AM IST

విజయవాడ అజిత్ సింగ్ నగర్ మకినేని బసవపున్నయ్య స్టేడియంలో... వాడి పడేసిన పీపీఈ కిట్ల కుప్పలు కనిపించడం.. కలకలం రేపింది. స్టేడియం ఆవరణలో కరోనా టెస్ట్​లు నిర్వహించిన సిబ్బంది ధరించిన పీపీఈ కిట్లు, గ్లౌజులు తదితర వాటిని వైద్య సిబ్బంది అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్టేడియంలోని బెంచీలతో పాటు.. అక్కడి ఆవరణలో పడి ఉన్న పీపీఈ కిట్లతో.. వాకర్లు, స్టేడియం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details