ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదిత్య దాడి చేయమంటేనే చేశాము: నిందితులు - పట్టాభిపై దాడి కేసు అప్​డేట్ వార్తలు

తెదేపా నేత పట్టాభిపై దాడి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిత్య అనే వ్యక్తి చెప్తేనే దాడి చేశామని.. నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఏడాది క్రితం అతను పరిచయమయ్యాడని తెలిపారు. నిందితులకు న్యాయస్థానం 14రోజుల రిమాండ్‌ విధించింది. దాడి సూత్రధారి ఆదిత్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

pattabi assault case update
పట్టాభి దాడి కేసులో పురోగతి

By

Published : Feb 13, 2021, 9:44 AM IST

తెలుగుదేశం నేత పట్టాభిపై దాడి ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 2వ తేదీ ఉదయం విజయవాడ అంబేద్కర్‌ కాలనీలోని తన నివాస సమీపంలోనే.. పట్టాభిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమవడమే కాక.. ఆయనకూ గాయాలయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా.. గుణదలకు చెందిన ఆనంద్, వెంకటేశ్, భాగ్యరాజు, భాస్కరరావు, సత్యనారాయణ, తులసీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య దాడి చేయమంటేనే చేశామని వారు విచారణలో వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

తెదేపా నేత పట్టాభిపై దాడి కేసులో పురోగతి

విజయవాడకు చెందిన ఆదిత్య అలియాస్‌ నానికి.. నిందితులు ఏడాది క్రితం క్రీడా మైదానంలో పరిచయమయ్యారు. దాడికి 2 రోజుల ముందు వారిని సంప్రదించిన ఆదిత్య.. ఒకరిపై దాడి చేసి భయపెట్టాలని, ప్రాణహాని తలపెట్టవద్దని చెప్పాడు. అందుకు వారు అంగీకరించారు. 2వ తేదీన పట్టాభి ఇంటి సమీపంలో.. ఏపీ16 ఈఆర్ 3434 కారుపై దాడి చేయాలని ఆదిత్య.. వారికి సూచించాడు. వారు అలానే చేశారు. వచ్చినవారిలో కొందరు పట్టాభిని గుర్తించి పరారయ్యారు. దాడి జరిగిన రోడ్డులోని ఓ ఇంట్లోనే CC కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పదిమంది పాల్గొన్నట్టు గుర్తించిన పోలీసులు.. తొలుత ఒకరిని అదుపులోకి తీసుకోగా.. అతని నుంచి మిగతా ఐదుగురి వివరాలూ రాబట్టారు.

ఆదిత్యతో ఉన్న పరిచయం వల్లే ఎవరిపై దాడి చేయాలో అడగకుండానే చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆదిత్య దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అతని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:'పోలీసులు అన్యాయంగా నా భర్తను అదుపులోకి తీసుకున్నారు'

ABOUT THE AUTHOR

...view details