కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్ ప్రాంతాల్లో చాలా చోట్ల.. మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రాగల రెండు రోజుల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నట్టు ప్రకటించింది. నైరుతీ రుతుపవనాల తిరోగమనంతో రాగల ఐదు రోజుల్లో వాయువ్య భారత్ లో పొడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ వెల్లడించింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
ప్రాంతం | నమోదైన వర్షపాతం (సెం.మీ) |
వెల్దుర్తి | 6.6 |
మిడ్తూరు | 6 |
బుక్కరాయ సముద్రం | 5.5 |
గిద్దలూరు | 5 |
పుత్తూరు | 3.3 |
ఆత్మకూర్ | 3.2 |
వత్సవాయి | 2.6 |
పోరుమామిళ్ల | 2.5 |
కుప్పం | 2.5 |