అన్ లాక్ 2.0 కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గ దర్శకాల మేరకే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వైరస్ వ్యాప్తి నివారణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటూనే... కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు “అన్‌లాక్” చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నీ ఆదేశాల్లో తెలిపారు.
రాష్ట్రంలో అన్ లాక్ 2.0 నిబంధనలివే - ఏపీలో అన్ లాక్
అన్ లాక్ 2.0 కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర మేరకు “అన్‌లాక్” చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నీ ఆదేశాల్లో తెలిపారు. జులై 31 వరకు అన్ లాక్ 2.0 ను అమలుకానుంది. పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారిని నిబంధనల మేరకే అనుమతించనున్నారు.
జులై 31 వరకు అన్ లాక్ 2.0 ను అమలు చేయాలని ఆదేశాల్లో తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమంతించేందుకు కరోనా నిబంధనలు 52, 53,55 మేరకు రాష్ట్రంలోకి అనుమతించాలని తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీసులు, కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డిఓలు, ఎంఆర్ఓలు,ఎంపీడీవోలకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినే