గుర్తు తెలియని వాహనం ఢీకొని.. కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం రాంచంద్రపురం వాసి పి.ప్రదీప్ మృతి చెందాడు. చాట్రాయి మండలం చనుబండలోని చిన్న చెరువు కట్టపై ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎదురుగా వచ్చిన వాహనమే ఘటనకు కారణమన్నారు. బాధితుడు అక్కడికక్కడే మరణించగా.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని.. గుర్తు తెలియని వాహనం బలి తీసుకుంది. ఎదురుగా వచ్చి బాధితుడిని ఢీకొనడంతో.. కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం రాంచంద్రపురం వాసి పి. ప్రదీప్ అక్కడికక్కడే మరణించాడు.
మృతి చెందిన ప్రదీప్