ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వింత వ్యాధితో బాధపడుతున్న దివీసీమ గోవులు - కృష్ణా జిల్లా తాజా వార్తలు

దివి సీమలో పశువులు వింత వ్యాధితో బాధపడుతున్నాయి. ఆవులకు బొబ్బలు వచ్చి తగ్గకపోగా... అవి పక్క వాటికి అంటువ్యాధిలా సోకుతున్నాయి. ప్రస్తుతం నాగాయలంకలో 69 ఆవులకు ఈ విధంగా వ్యాధి సోకింది. పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

unknown disease came to divi seema cows and calfs in krishna disrict
వింత రోగం బాధపడుతున్న ఆవులు

By

Published : May 18, 2020, 5:21 PM IST

కృష్ణా జిల్లా దివి సీమలో పశువులకు కొత్త కష్టం వచ్చింది. అన్నదాతను అన్నివిధాలా ఆదుకుంటున్న ఆవులకు, ఎడ్లకు... ఒంటిపై బొబ్బలు రావడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక ప్రక్క కొవిడ్-19 ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూ బిక్కు బిక్కు మని గడుపుతుంటే... ఇప్పుడు పశువులకు వింత వ్యాధి రావడం వల్ల ఏమి చేయాలో తెలియక పాడి రైతన్నలు తల్లడిల్లుతున్నారు.

బొబ్బలు వచ్చిన ఆవులను కొందరు రైతులు తమ పొలంలో పశుగ్రాసం తినేందుకు అనుమతించటం లేదు. ఈ వైరస్​ తమ పశువులకు వస్తుందని కొందరు గేదెలను సైతం తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. నాగాయలంకలో సుమారు 500 ఉన్న ఆవుల మందలో 60 ఆవుల చర్మంపై బొబ్బలు వచ్చాయి. అవి ప్రక్కన ఉన్న అవులకు సైతం అంటుకున్న తీరుపై పశుకాపరులు సైతం భయబ్రాంతులకు గురవుతున్నారు.

ఈ విషయాన్ని స్థానిక పశువైద్య అధికారులకు తెలుపగా కొన్ని రకాల ఇంజక్షన్​లు ఇచ్చారని.. అయినప్పటికీ మచ్చలు తగ్గకపోగా ఇంకా పక్కవాటికి రావడం వల్ల ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయామని వాపోతున్నారు. పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు స్పందించి రక్త నమూనాలు సేకరించి ఈ బొబ్బల వ్యాధి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో రైతులకు వివరించాలని పశువుల యజమానులు విన్నవించుకున్నారు.

ఇదీ చదవండి:

కొత్తూరు గోశాలకు తెలంగాణ భాజపా ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details