ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్​లైన్ పరీక్షలకు ఆర్​జేయూకేటీ సన్నద్ధం - రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం వార్తలు

రాష్ట్రంలో తొలిసారిగా భారీస్థాయిలో ఆన్​లైన్ పరీక్షలు నిర్వహించేందుకు రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం ముందడుగు వేసినట్లు యూనివర్శిటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి 16 వరకు నాల్గో సంవత్సర విద్యార్థులకు ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలను ఆన్​లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు ఛాన్సలర్ తెలిపారు.

University Chancellor Professor Casey Reddy
రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం

By

Published : Oct 11, 2020, 10:43 AM IST

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో గల ఆర్​జేయూకేటీ పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి మాట్లాడారు. ఆర్​జేయూకేటీ పరిధిలోని నాల్గో ఏడాది సుమారు 1,800 మంది విద్యార్థులకు ఆన్​లైన్​ ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం సన్నద్ధం అయినట్లు తెలియజేశారు. జాతీయ స్థాయిలో ఆన్​లైన్ టెండర్స్ విధానం ద్వారా గుర్తింపు పొందిన ఒక ఏజెన్సీని ఎంపిక చేసి...పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.

ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో 90 శాతం మంది విద్యార్థులు ఆన్​లైన్ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉండగా... కేవలం తొమ్మిది మంది మాత్రమే క్యాంపస్​లో నేరుగా పరీక్షలు రాసేందుకు హాజరవుతున్నట్లు ఛాన్సలర్ తెలిపారు ఆర్​కే​ వ్యాలీలో 160 మంది విద్యార్థులు నేరుగా పరీక్షలు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంట్రీ లెవల్​లోని అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యేకమైన గదిలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.

25న ఫలితాలు...
ఈ నెల 12 నుంచి 16 వరకు ఆరు రోజుల్లో పరీక్షలు నిర్వహించి 25న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఇంతకంటే బాగా పరీక్షలు రాయాలని నమ్మకం ఉన్న విద్యార్థుల కోసం క్యాంపస్​లో రీ ఓపెన్ సందర్భంలో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ పరీక్షలో విద్యార్థులకు అధికంగా మార్కులు లభిస్తాయో... వాటిని ప్రమాణంగా తీసుకుని మార్కులు జాబితా సర్టిఫికెట్లు విడుదల చేయడం జరుగుతుందన్నారు. యూనివర్సిటీ లెవెల్ పీయూసీలో ఇతర ప్రాంతాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను 40 మంది విద్యార్థులు క్యాంపస్ నుంచి పరీక్షలు పూర్తి చేసుకొని వెళ్ళినట్లు తెలియజేశారు. ఆర్​జేకేయూటీ పరిధిలో నాలుగు వేల 400 మంది విద్యార్థులు నుంచి కేవలం 40 మంది మాత్రమే విద్యార్థులు బయటకు వెళ్ళటంతో మిగిలిన విద్యార్థులు ఇక్కడ అందించే ప్రామాణిక సాంకేతిక విద్య పట్ల ఆసక్తి వ్యక్తమవుతున్నాయని వివరించారు.

మానిటరింగ్ ఉంటుంది..
ఆన్​లైన్​ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పట్ల ప్రొఫెసర్ల మానిటరింగ్ కొనసాగుతుందని ఆర్​జేయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి అన్నారు. పరీక్ష హాల్లో మాదిరిగానే పూర్తిస్థాయి మానిటరింగ్ ఉంటుందన్నారు. ఆన్​లైన్​ పరీక్షకు కూర్చునే విద్యార్థి ముందుగా గది పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆన్​లైన్​ పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు.

ఇదీ చదవండి:ఉపాధ్యాయ బదిలీలకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details