ప్రభుత్వ పాఠశాలల్లో 25వేలకు పైగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జి అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించి పరష్కారం కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన మండిపడ్డారు.
కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అవలంబించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన అని చెప్పి.. ఏ మాధ్యమంలో బోధన చేయాలో తెలియని పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. అధికారంలోకి వస్తే నెలరోజుల్లో సీపీయస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.