ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపులపాడులో పసికందును వదిలేసిన దుండగులు

సంతానం లేని వారినడిగితే తెలుస్తోంది పిల్లల విలువ. పిల్లలపై ప్రేమలేని వారికేమి తెలుసు ఆ బాధ. ఆ అప్యాయతే ఉంటే ఆ పసికందును బెడ్​షీట్​తో చుట్టి బుట్టలో పెట్టేసి వదిలేసి వెళ్లరు. ఈ ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అరుగోలను గ్రామంలో జరిగింది.

By

Published : Nov 9, 2020, 1:29 PM IST

బాపులపాడులో పసికందును వదిలేసిన దుండగులు
బాపులపాడులో పసికందును వదిలేసిన దుండగులు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లిపోయారు. అరుగోలను గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అరుగొలనులోని స్నేహ భవన్​లో మేరి అనే సిస్టర్ బయటికి వచ్చి చూడగా ఆ పసిపాప కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ శిశువు బెడ్​షిట్​తో చుట్టి బుట్టలో పెట్టిసి దుండగలు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆ పాప ఏడుపు విన్న మేరీ... శిశువును తన దగ్గర ఉంచుకున్నట్లు వివరించారు. ఘటనపై సీసీ కెమెరాలోని పుటేజీని పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్ఐ చంటిబాబు, ఐసీడీఎస్, సీడబ్యూసీ, ఎంఎస్​కే వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details