అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ని విడుదల చేస్తామన్న జగన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. తక్షణమే ప్రభుత్వ శాఖలలోని 20వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగుల యత్నం
విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేశారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని, ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
APPSC