ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతు సహకారమందిస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మూలపాడులో ముగిసిన అండర్-19 జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బీసీసీఐ ప్రతినిధులు, మాజీ ఎంపీ గోకరాజ గంగరాజుతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పోటీల్లో విజేతగా నిలిచిన పశ్చిమ బంగాల్ జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఉత్తమ ప్రతిభ చూపిన హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర టీమ్ క్రీడాకారులకు మెమెంటోలు అందించారు.
అండర్-19 జాతీయస్థాయి క్రికెట్ విజేతకు ట్రోఫీ ప్రధానం - gokaraju ganga raju
ఇబ్రహీంపట్నం మూలపాడులో ముగిసిన అండర్-19 జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. పోటీల్లో విజేతగా నిలిచిన పశ్చిమ బంగాల్ జట్టు...ట్రోఫీ అందుకుంది.
అండర్-19 జాతీయస్థాయి క్రికెట్ విజేతకు ట్రోఫీ ప్రధానం