ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపోరు: కృష్ణాలో ఏకగ్రీవాల లెక్కలివీ... - కృష్ణాజిల్లాలో ఏకగ్రీవమైన మున్సిపాలిటీ వార్డులు

పురపాలిక ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అంతిమంగా బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు తేలాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు పెడన, ఉయ్యూరు, నూజివీడు, నందిగామ, తిరువూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

unanimously elected candidates in krishna district municipalities
కృష్ణాలో ఏకగ్రీవాలు

By

Published : Mar 4, 2021, 6:54 AM IST

మంగళవారం మొదలైన పురపోరు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం వరకు కొనసాగింది. కృష్ణా జిల్లాలో ఒక్కరే మిగిలిన చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను ఆర్వోలు సిద్ధం చేశారు. నామపత్రాల లెక్కలో తేడా రావడంతో.. విజయవాడ నగరపాలికలో వివరాల వెల్లడికి బాగా ఆలస్యమైంది.

మచిలీపట్నంలో...

ఓ వార్డు ఏకగ్రీవమైంది. 11వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అక్కడ పోటీలో ఉన్న వైకాపా అభ్యర్థి నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 36వ డివిజన్‌లో తెదేపా, సీపీఎం మధ్య అవగాహన కుదిరింది. ఆ స్థానాన్ని సీపీఎంకు వదిలిపెట్టారు.

విజయవాడలో...

నగరంలోని 15వ వార్డులో జనసేన అభ్యర్థి జాన్సీరాణికి మద్దతుగా తెదేపా అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

నూజివీడులో...

30వ వార్డులో తెదేపా అభ్యర్థి నామపత్రం ఉపసంహరించుకున్నారు. వైకాపా అభ్యర్థి గిరీష్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఏర్పడింది. 24వ వార్డులోనూ తెదేపా అభ్యర్థి నామినేషన్‌ వెనక్కి తీసుకోవడంతో.. అధికార పార్టీకి చెందిన సుజాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 2వ వార్డులో తెదేపా అభ్యర్థి ఎరకయ్య అనూహ్యంగా వైకాపాలో చేరారు. తన నామినేషన్‌ మాత్రం ఉపసంహరించుకోలేదు. వైకాపా తరపున బరిలో ఉన్న అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఉయ్యూరులో...

రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో.. 3వ వార్డులో పద్మ, 15వ వార్డులో లక్ష్మి వైకాపా తరపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తిరువూరులో...

2, 3 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు తప్ప ఎవరూ పోటీలో లేకపోవడంతో అవి ఏకగ్రీవం అయ్యాయి.

ఇదీ చదవండి:

పురపోరు: వేడెక్కిన విజయవాడ రాజకీయాలు

ABOUT THE AUTHOR

...view details