ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లభించని మత్స్యకారుల ఆచూకీ.. ఆందోళనలో కుటుంబసభ్యులు - లభించని మత్స్యకారుల ఆచూకీ

Fisherman's Family Members Tension: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారు బ్రతుకున్నారో లేదో తెలియక మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారి జాడను త్వరగా కనిపెట్టాలని వేడుకుంటున్నారు.

లభించని మత్స్యకారుల ఆచూకీ
లభించని మత్స్యకారుల ఆచూకీ

By

Published : Jul 5, 2022, 3:20 PM IST

Tension: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేట నుంచి అంతర్వేదికి నలుగురు జాలర్లు విశ్వనాథపల్లి చినమస్తాన్, రామాని నాంచార్లు, చెక్క నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావు సముద్రంలో వేటకు వెళ్లి కనిపించకుండా పోయారు. వేటకు వెళ్లిన తమ వారి సమాచారం తెలియక.. మత్స్యకార కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. బ్రతికున్నారో లేదో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారి జాడను త్వరగా కనిపెట్టాలని అధికారులను వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details