'విజయసాయీ... భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నావ్' - devineni
కుట్రపూరితంగానే రాష్ట్రాభివృద్ధి వ్యతిరేకులతో కలిసి జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల సమస్యలపై స్పందించని... వ్యక్తులంతా ఆంధ్రప్రదేశ్‌లో లేని సమస్యలు సృష్టించి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
దేవినేని ఉమాxవిజయసాయిరెడ్డి
వైకాపా నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చే పసుపు-కుంకుమ పథకం డబ్బులు, వృద్ధులకు పింఛన్ అందకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులు చేస్తున్న పనులను మాట్లాడే తీరును ప్రజలు గమనిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సమస్యలేని తిరుపతి దేవుని నగలపై ఇష్టారాజ్యంగా మాట్లుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు.