ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొని కేక్ కట్ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అంజద్ భాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలు కేకు కోసి తమ ఆనందం వ్యక్తం చేశారు.
సాలూరులో కేక్ కట్ చేసి సంబరాలు