ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ : భాజపా రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం - తెలంగాణ తాజా వార్తలు

భాజపా రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. అక్కడ పనిచేసే ఇద్దరికి కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. మంగళవారం ఈ భవనంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.

తెలంగాణ : భాజపా రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం
తెలంగాణ : భాజపా రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం

By

Published : Apr 7, 2021, 6:43 AM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం శ్యామ్​ ప్రసాద్​ ముఖర్జీ భవన్​లో కరోనా కలకలం రేగింది. కార్యాలయంలో పనిచేసే ఇద్దరు కొవిడ్​ బారిన పడినట్లు నిర్ధరణ అయింది. అప్రమత్తమైన మిగిలిన సిబ్బంది.. పార్టీ కార్యాలయాన్ని శానిటైజేషన్​ చేశారు.

ఆందోళనలో పార్టీ నేతలు..

నిత్యం వివిధ పార్టీ కార్యక్రమాలకు వేదికైన శ్యామ్​ ప్రసాద్​ ముఖర్జీ భవన్​లో కరోనా కలకలంతో పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఈ కార్యాలయంలోనే రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.

రాష్ట్ర అగ్రనేతలు హాజరు..

ఈ భేటీకి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యహహారాల బాధ్యుడు తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా కీలక నేతలు హాజరయ్యారు.

ఇవీ చూడండి

:ఎస్‌ఈసీ సవాల్​పై ఉదయం హైకోర్టు విచారించే అవకాశం

ABOUT THE AUTHOR

...view details