ప్రభుత్వ పాఠశాలలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మూడో దశ ముప్పు పొంచి ఉందని అంతా భయపడుతున్న వేళ.. చిన్నారులపై వైరస్ ప్రభావం పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పాఠశాలలు నడుస్తున్న తరుణంలో.. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.
తాజాగా కృష్ణా జిల్లా నందివాడ మండలం శంకరంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పాఠశాలలో 30 మంది విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో.. రెండో తరగతి విద్యార్థి, ఐదవ తరగతి విద్యార్థికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో నేడు, రేపు పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పాఠశాలలో అధికారులు శానిటైజ్ చేయించారు.