జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కంచికచర్లలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన వ్యక్తి ఖమ్మం నగరంలోని రంగనాయకుల గుట్టకు చెందిన వినయ్‌గా పోలీసులు గుర్తించారు. వత్సవాయి మండలం కాకరాయి గ్రామానికి చెందిన దుర్గయ్యకు తీవ్ర గాయాలవ్వగా.., నందిగామలోని ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని బిచ్చగాడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహంపై నుంచి వాహనాలు వెళ్లడంతో గుర్తు పట్టలేకుండా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి - two members dead in road accident latest news update
కృష్ణాజిల్లా కంచికచర్లలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిటాలలోని జాతీయ రహదారిపై ఈ ఘటనలు జరిగాయి.

కంచికచర్లలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు
కంచికచర్లలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు
ఇవీ చూడండి...