ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా నదిలో ఇద్దరు పశువుల కాపర్లు గల్లంతు - కృష్ణా నదిలోకి దిగి ఇద్దరు గల్లంతు

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామంలో గేదెలను మేపుకుంటూ కృష్ణా నదిలోకి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు గుర్రం విద్యాసాగర్‌, ఉగ్గం మురళిగా పోలీసులు గుర్తించారు. ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Two persons drowned in river Krishna
కృష్ణా నదిలోకి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతు

By

Published : Nov 3, 2020, 3:36 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామంలో గేదెలు మేపుకుంటూ కృష్ణా నదిలోకి దిగిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిద్దరూ గ్రామానికి చెందిన గుర్రం విద్యాసాగర్‌, ఉగ్గం మురళిగా పోలీసులు గుర్తించారు. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు భారీగా జరగటం వల్ల సుమారు 20 అడుగుల లోతులో నదిలో భారీ గుంత ఏర్పడింది. వీరిద్దరూ పశువులను నదిలో నుంచి లంకలోకి తీసుకెళ్తుండగా ఆ గోతిలో పడిపోయి ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details