కృష్ణా జిల్లా నందివాడ మండలం శివయ్య పాకల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మహిళ సహా మరో వ్యక్తి మృతి చెందాడు. నాగేశ్వరమ్మ తన కుమారుడితో కలిసి హనుమాన్ జంక్షన్ నుంచి పెదపారపూడి వైపు వస్తుండగా... పుట్టగుంట నుంచి నాగబాబు, నవీన్ అనే ఇద్దరు యువకులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాగేశ్వరమ్మ, నాగబాబు మృతి చెందారు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను విజయవాడ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నందివాడలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి - road_accident
కృష్ణా జిల్లా నందివాడ శివయ్య పాకల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్వి చక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
నందివాడలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి