కృష్ణా జిల్లా నూజివీడులో మరణించిన తమ బంధువు అంత్యక్రియలకు గుంటూరు నుంచి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరికి కరోనా బయటపడింది. రెండు ద్విచక్ర వాహనాలపై ఈ ముగ్గురూ ఈ నెల18న నూజివీడు వెళ్లారు. అదేరోజూ తిరిగి వస్తుండగా నూజివీడు సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆపి ఆరా తీశారు. గుంటూరు నుంచి వచ్చినట్లు తెలిసిన వెంటనే క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వాళ్లకు చేసిన పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం రాగా... అందులో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారో... ఆయా ప్రదేశాలకు ఎవరెవరు వచ్చారో తెలుసుకుని, వారందరినీ క్వారంటైన్‌కు తరలించే పనిలో పడ్డారు. గుంటూరు యంత్రాగాన్నీ అప్రమత్తం చేయటంతో ఇక్కడి పోలీసులు బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీకులను శనివారం క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
కరోనాను మోసుకెళ్తూ... పోలీసులకు చిక్కారు..! - గుంటూరు జిల్లాలో కరోనా కేసులు
గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు లాక్‌డౌన్‌ను పాటించకుండా కృష్ణా జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. చెక్‌పోస్టు వద్ద వారిని పోలీసులు ఆపి క్వారంటైన్ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో ఇద్దరికి కరోనా పాటిటివ్‌గా తేలింది.
corona cases in ap
వైద్యుడికి కరోనా
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రముఖ వైద్యుడికి, ఆయన భార్యకు కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయిందని ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు.