విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎక్స్ఎల్ ప్లాంట్ సమీపంలో శివరామకృష్ణ అనే వ్యక్తి మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడగా.. కొత్త రాజరాజేశ్వరిపేటలో ఆర్థిక ఇబ్బందులతో రాజబాబు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలపై అజిత్సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య - today vijayawada crime latest news update
వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
రెండు వేరు వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య