కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో వెనుక వస్తున్న రెండు లారీలు.. ఒక కారు ఢీ కొన్నాయి. లారీ కిందకి కారు చొచ్చుకుపోయింది. లారీల డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. గాయపడిన వారిని బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రెండు లారీలు-కారు ఢీ.. క్యాబిన్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్లు - accident at ibrahimpatnam national highway news
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో ఢీకొన్న వాహనాలు