కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. పోలీసులు మూడు గంటలపాటు శ్రమించి వారిని బయటకు తీసి విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. వెలుతురు లేమి, ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు జగ్గయ్యపేట మండలం బండిపాలేనికి చెందిన గోపి, నందిగామ మండలం అనాసాగరానికి చెందిన వారిగా గుర్తించారు.
రెండు లారీలు ఢీ... క్యాబిన్లలో డ్రైవర్ల అవస్థ! - పరిటాల
వెలుతురు లేమి, ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయాలన్న తొందర ప్రమాదాన్ని కొనితెచ్చింది. పరిటాల జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు.
రెండు లారీలు ఢీ.. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు