వివిధ ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కృష్ణాజిల్లా గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ల మండలానికి చెందిన మీసాల శ్రీనివాసరావు, ఓ బాలుడు... విజయవాడలో గంజాయి అమ్ముతూ రాత్రివేళల్లో వాహనాలను దొంగిలించే వారని పోలీసులు తెలిపారు. వాహనదారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రెండు కేజీల గంజాయి, మూడు ద్విచక్రవాహనాలు, ఒక జీపు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.
గుడివాడలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు - news updates in gudivada
వేర్వేరు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు